చరణ్ గ్లోబల్ స్టార్ కాదా!.. చికిరి సాంగ్స్ వ్యూస్ ఎంత!
on Nov 10, 2025
.webp)
-చరణ్ గ్లోబల్ స్టార్ కాదా!
-మెగా పవర్ స్టార్ అని చెప్పారు.
-చికిరి సాంగ్స్ సంచలనం
-పెద్ది పై అభిమానుల భారీ అంచనాలు
మొత్తానికి 'రామ్ చరణ్'(Ram Charan)తన అప్ కమింగ్ మూవీ 'పెద్ది' (Peddi)తో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా ఉన్నాడు. గత పరాజయానికి గట్టిగా గుణపాఠం చెప్పేలా సిల్వర్ స్క్రీన్ పై ఒక భారీ హిట్ ని అందుకోబోతున్నాడనే సంకేతాలు కూడా చాలా స్పష్టంగానే కనపడుతున్నాయి. ఇందుకు ఇప్పటికే రిలీజైన టీజర్ తో పాటు, రీసెంట్ గా విడుదలైన 'చికిరి' సాంగ్ ఉదాహరణగా నిలుస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు ప్రేక్షకులు వెల్లడి చేస్తు వస్తున్నారు. అదే సమయంలో మరో విషయంలో కూడా ఆ అందరి మధ్య ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది.
చికిరి సాంగ్ టీజర్ లో రామ్ చరణ్ పేరుని మెగాపవర్ స్టార్ గా సంబోధించారు. కానీ ఆర్ఆర్ ఆర్ హిట్ తర్వాత చరణ్ ని గ్లోబల్ స్టార్ అనే టైటిల్ తో అభిమానులు పిలుస్తు వస్తున్నారు. గేమ్ చేంజర్ టైటిల్స్ లో కూడా గ్లోబల్ స్టార్ అని ప్రస్తావించడం జరిగింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గ్లోబల్ స్టార్ అనే క్యాప్షన్ తో చరణ్ రేంజ్ గ్లోబల్ స్థాయిలో కొనసాగాలని వాళ్లంతా కోరుకున్నారు. అలాంటిది ఇప్పుడు 'పెద్ది'కి మెగా పవర్ స్టార్ అనే క్యాప్షన్ ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంపైనే అభిమానులు, మూవీ లవర్స్ ఎందుకు అలా జరిగిందని చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై చరణ్, మేకర్స్ అధికారకంగా తెలిపే దాకా సోషల్ మీడియా వేదికగా రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉంటాయి.
ఇక ఏ ఆర్ రెహ్మాన్(Ar Rehman)మ్యూజిక్ లో వచ్చిన 'చికిరి'(Chikiri)సాంగ్ వరల్డ్ వైడ్ గా ఉన్న మెగా అభిమానులనే కాకుండా, పాన్ ఇండియా మూవీ లవర్స్ ని ఒక ఊపు ఊపుతుంది. అమెరికా నుంచి అనకాపల్లి దాకా చికిరి సాంగ్ కి చరణ్ చేసిన హుక్ స్టెప్ తో ఇనిస్టా లో రీల్స్ ఒక రేంజ్ లోనే సాగుతున్నాయి. సదరు రీల్స్ కి ఆడ, మగ, చిన్న,పెద్ద అనే ఏజ్ తారతమ్యం కూడా లేకుండా పోయింది. తెలుగులోనే కాకుండా సాంగ్ రిలీజైన అన్ని బాషల్లోను ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇక తెలుగుకి సంబంధించి విడుదలైన మూడు రోజులకే 38 మిలియన్ల కి పైగా వ్యూస్ ని దాటి 40 మిలియన్ల వ్యూస్ కి అతి చెరువులో ఉంది. చరణ్ బర్త్ డే కానుకగా వచ్చే ఏడాది మార్చి 26 , 2026 న వరల్డ్ వైడ్ గా 'పెద్ది' పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మరి రిలీజ్ అయ్యే లోపు ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి. చరణ్ సరసన అచ్చాయమ్మా గా 'జాన్వీ కపూర్'(Janhvi Kapoor)జత కడుతుండగా బుచ్చిబాబు సాన(BuchiBabu Sana)దర్శకుడు. వృద్ధి(Vruddi)సినిమాస్ భారీ వ్యయంతో నిర్మిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బాగస్వామ్యులుగా వ్యహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



