రోజుకి కోటి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్
on Mar 30, 2017
.jpg)
ప్రస్తుతం తెలుగులో టాప్ హీరో ఎవరంటే, గుక్క తిప్పుకోకుండా ప్రతి ఒక్కరు చెప్పే పేరు పవన్ కళ్యాణ్. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా, ఫాన్స్ ఫాలోయింగ్ విషయంలో అందరిని మించి ముందున్నాడు. ఈ మధ్యే విడుదలయిన కాటమరాయుడు యావరేజ్ టాక్ తో మొదటి వారంలోనే 50 కోట్లు పై చిలుకు వసూళ్లు రాబట్టనుంది. అదే ఇంకొకరయితే, పరిస్థితి ఇంకోలా ఉండేది. త్వరలో సినిమా సన్యాసం పుచ్చుకుంటానన్న పవన్ కళ్యాణ్ తో పని చేయాలని టాప్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూలు కడుతున్నారు. అయితే, పవన్ మాత్రం ఎవరితో చేసిన ఇంకో రెండు సినిమాలు మించి తీయకూడదని భీష్మించుకొని కూర్చున్నాడు. తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ ది పోనూ, పవన్ చేసేది ఇంకా ఒక్క సినిమా మాత్రమే. తమిళ దర్శకుడు నీసన్ తో ఏయం రత్నం నిర్మాణంలో పవన్ ఒక సినిమా చేయాల్సి ఉంది.
కానీ, ఈ సినిమా క్యాన్సల్ అయినట్టు వార్తలొస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం, యూవీ క్రియేషన్స్ వాళ్ళు పవన్ కి బంపర్ ఆఫర్ ఇవ్వడమే. పవన్ కళ్యాణ్ కేవలం 40 రోజుల కాల్ షీట్స్ ఇవ్వగలిగితే, రోజుకి ఒక కోటి చొప్పున 40 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్దమయ్యారంట. ఆఫర్ టెంప్టింగ్ గా ఉండడంతో పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడట. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, త్రివిక్రమ్ మూవీ తర్వాత పట్టాలకెక్కనుంది. ఏదేమైనా 40 కోట్లు పారితోషికం అంటే మాములు విషయం కాదు. ఇది నిర్మాతలకి పవన్ మీద ఉన్న అపారమైన నమ్మకం గా చెప్పుకోవచ్చు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



