పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
on Mar 7, 2016

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు చాలు తెర చిరిగిపోవడానికి. కలెక్షన్ల సునామీ బాక్సాఫీస్ పై దాడి చేయడానికి. యూత్ లో పవన్ కు ఉన్నంత క్రేజ్ ఇంకెవరికీ లేదంటే ఆశ్చర్యం లేదేమో. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ చేస్తున్న పవన్, ఆ తర్వాత మరి కొన్ని సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఇంకో రెండు మూడేళ్లలో పూర్తి చేసేసి, పూర్తి స్థాయిగా రాజకీయ నాయకుడిగా మారిపోతానంటున్నారు పవన్. అభిమానులకు ఇది బ్యాడ్ న్యూసే అయినా, సాక్షత్తూ పవన్ చెప్పిన మాట ఇది. ఫిల్మ్ కంపానియన్ అనే యూట్యూబ్ ఛానల్ తరపున జర్నలిస్ట్ అనుపమ్ చోప్రా పవన్ ను ఇంటర్వ్యూ చేశారు. తనకు చిన్నప్పటి నుంచీ వ్యవసాయమంటే ఇష్టమని, అనుకోకుండా నటుడినయ్యానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పవన్. మరి కాసేపట్లో, ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లోకి రానుంది.

కేవలం తన ఉపాధి కోసం సినిమాలని, కానీ రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం ప్రజల కోసమని, కొన్నేళ్లలో పూర్తిగా రాజకీయాలవైపు వెళ్తానని అన్నారు. బహుశా 2019 సార్వత్రిక ఎన్నికలలోపు, తన కమిట్ మెంట్స్ పూర్తి చేసుకుని, పూర్తి స్థాయి పార్టీగా జనసేనను తీర్చిదిద్దే అవకాశం ఉంది. పొలిటికల్ గా కంటే, పవర్ స్టార్ కు సినిమాలకే ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి పవన్ నిర్ణయాన్ని అభిమానులు ఎంతవరకూ జీర్ణించుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



