తమిళంలోకి యంగ్ టైగర్ ' టెంపర్ '
on Mar 7, 2016

ఫ్లాపుల బాటలో ఉన్న ఎన్టీఆర్ ను గట్టెక్కించి, హిట్టు మెట్టు తొక్కేలా చేసింది టెంపర్. ఎన్టీఆర్ ను పూరి చూపించిన విధానం నందమూరి అభిమానుల మన్ననలు అందుకుంది. ఈ సినిమా ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతోంది. ఈ మధ్య వివాదాల్లో నలుగుతున్న తమిళ నటుడు శింబు హీరోగా, తమిళంలో తెరకెక్కబోతోంది. టెంపర్ రైట్స్ ను మైఖేల్ రాయప్పన్ కొన్నాడు. వాలు ఫేం విజయ్ చందర్ డైరెక్షన్లో, శింబు హీరోగా సినిమాను తెరకెక్కించాలని ఆయన ఫిక్సయ్యాడట.
దాదాపు స్క్రిప్ట్ వర్కంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. మహిళలకోసం ఫైట్ చేసే క్యారెక్టర్ కావడంతోనే శింబు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని సమాచారం. ఇప్పటికే తమిళనాట, బీప్ సాంగ్ కారణంగా తనకున్న లేడీ ఫాలోయింగ్ ను కోల్పోయాడు శింబు. టెంపర్ తో మళ్లీ వారందరినీ తన సినిమాలకు రప్పించాలనే టార్గెట్ పెట్టుకున్నాడు శింబు. ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో తమిళ వెర్షన్ లో బిజీగా ఉన్న శింబు, ఆ షూట్ పూర్తవ్వగానే టెంపర్ పై దృష్టి పెట్టబోతున్నాడని సమాచారం. మరి శింబు మళ్లీ వెనుకటి ఫామ్ దొరకబుచ్చుకుంటాడో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



