పవన్ తో లక్ష్మీరాయ్ సెల్ఫీ.. సూపర్ రెస్పాన్స్
on Oct 3, 2015

పవన్ కళ్యాణ్ నటించిన "గబ్బర్ సింగ్" ఎంత హిట్టయిందో తెలిసిందే. ఈతరువాత గబ్బర్ సింగ్ సీక్వెల్ లో "గబ్బర్ సింగ్ 2" సినిమా మొదలవుతుందని అన్నారు. తరువాత దానిని కాస్త "సర్దార్ గబ్బర్ సింగ్" కు మార్చారు. అయితే గతంలో ఈ సినిమా మాత్రం అంత వేగంగా షూటింగ్ జరుపుకోవడం లేదని.. సినిమా జరగుతున్నా పవన్ సరిగా రావడం లేదని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా.. ఈ సినిమాలో లక్ష్మీరాయ్ ఒక ముఖ్యపాత్రలో నటించడమే కాదు.. ఒక సాంగ్ కూడా చేస్తుంది. ఈ సందర్బంగా లక్ష్మీరాయ్ షూటింగ్ స్పాట్లో పవన్ కళ్యాణ్ తో ఒక సెల్ఫీ దిగి దానిని ట్విట్టర్లో ఫోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతేకాదు తనకు పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నానని.. పవన్ తో నటించిన తరువాత ఇంకా అవకాశాలు వస్తాయని అనుకుంటున్నానని తెలిపింది ఈ అమ్మడు. మరి పవన్ తో నటించిన తరువాతైన అమ్మడికి అవకాశాలు తలుపు తడతాయో లేదో చూడాలి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



