సినిమాలు మానేద్దామని అనుకున్నాను.. నేను ఆ హీరో కంటే తక్కువే
on Jul 21, 2025
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ఈ నెల 24 న వరల్డ్ వైడ్ గా 'హరిహర వీరమల్లు'(Hari Hara Veera mallu)తో థియేటర్స్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. గత చిత్రం 'బ్రో' వచ్చి మూడు సంవత్సరాలు కావడం, పవన్ ఫస్ట్ టైం చేస్తున్న పీరియాడిక్ చిత్రం 'వీరమల్లు' నే కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను వీరమల్లు పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొననుంది.
ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం పవన్ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 'వీరమల్లు' ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఈ నెల 24 న రాబోతుంది. సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోలతో పోల్చుకుంటే నేను తక్కువే. దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినంత నాకు బిజినెస్ అవ్వదు. వాళ్ళకి వచ్చినన్ని కలెక్షన్స్
కూడా నాకు రాకపోవచ్చు. నా దృష్టిని సినిమాలో ఉండే పోటీపై ఎప్పుడు ఫోకస్ చెయ్యలేదు. చిత్ర పరిశ్రమలో ఉండే ఎంతో మంది హీరోల్లో నేను కూడా ఒక హీరోని. సంవత్సరంలో ఒక గురువారం లేదా శుక్రవారం నా సినిమా ఉంటుంది.
ఇది అందరి పరిశ్రమ. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా,ప్రతిభ ఉంటే ఎవరైనా సినీ రంగంలో రాణించవచ్చు. చిరంజీవి(Chiranjeevi)గారి తమ్ముడైన, కొడుకైనా, నా కొడుకైనా నువ్వు ఎవరనేది విషయం కాదు. టాలెంట్ లేకుండా ఇక్కడ ఎవరు నిలబడలేరు. సుస్వాగతం సినిమా టైంలో ఒక పాటకి బస్ పైకి ఎక్కి డాన్స్ చెయ్యమనగానే సగం చచ్చిపోయాను. దాంతో మా వదినకి ఫోన్ చేసి సినిమా వదిలి వెళ్లిపోదామనుకున్నానని పవన్ చెప్పుకొచ్చాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
