అబ్బాయ్ సినిమాకు బాబాయ్ నిర్మాత!!
on Jun 22, 2019

అబ్బాయ్ రామ్ చరణ్ తో బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా నిర్మిస్తే.... ఆ సినిమాకు త్రివిక్రమ్ డైరక్టరైతే ఎలా ఉంటుందో ఆలోచించండి. అద్భుతంగా ఉంటుంది కదా? అవును ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ ప్రజంట్ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అయిపోయాక సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాను ఇకపై సినిమా చేయబోననీ, ప్రజా సేవకే అంకితమవుతాననీ పలు కార్యక్రమాల్లో చెప్పుకొచ్చాడు పవన్. ఇక ఎలక్షన్స్ పూర్తై ఫలితాలు తారుమారుగా వచ్చాయి. ఈ క్రమంలో మళ్లీ పవన్ సినిమాల్లోకి వస్తున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు హీరోగా కాదు, నిర్మాతగా మారుతున్నట్లు సమాచారం. అవును పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్ పై రామ్ చరణ్ హీరోగా సినిమా చేయమని త్రివిక్రమ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ వార్తలో నిజానిజాలు ఏంటో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



