'కల్కి' వివాదం సంగతేంటి?
on Jun 22, 2019
'కల్కి' కథ ఎవరిది? దర్శకుడు ప్రశాంత్ వర్మకు చెందిన స్ర్కిప్ట్ విల్ టీమ్‌దా? ఆరోపణలు చేస్తున్న యువ రచయిత కార్తికేయదా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిది హాట్ డిస్కషన్. గతంలో కొన్ని సినిమాల విడుదలకు ముందు ఇటువంటి సమస్యలు వచ్చాయి. అయితే... తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవన్నీ టీ కప్పులో తుఫానుగా మిగిలాయి. సినిమా విడుదలపై ఎఫెక్ట్ చూపించలేదు. జూన్ 28న విడుదల కానున్న రాజశేఖర్ 'కల్కి'పై కూడా ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపించడం లేదు. సాధారణంగా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు కథ తనదేనంటూ వచ్చిన వ్యక్తిని ఎవరూ పట్టించుకోరు. కానీ, 'కల్కి' విషయంలో అలా జరగలేదు. స్క్రిప్ట్ ను తీసుకువెళ్లి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఏర్పాటు చేసిన కథాహక్కుల వేదిక ముందు పెట్టింది. కార్తికేయ స్క్రిప్ట్, 'కల్కి' స్క్రిప్ట్ చదివిన కథాహక్కుల వేదిక బృందం ప్రాధమికంగా ఎటువంటి పోలికలు లేవని తేల్చింది. అయినా.. కార్తికేయ వినడం లేదు. కథ తనదేనని పట్టుబడుతున్నారు. మీడియా ముందుకు వచ్చారు. 'కల్కి' టీమ్ కార్తికేయ ఆరోపణలను ఖండిస్తోంది. సోమవారం దర్శకుల సంఘంలో ముఖ్యులు సినిమా చూడనున్నారట. ఏమవుతోందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
