ఆడియో ఫంక్షన్ కు అన్నయ్యను ఆహ్వానించాం - పవన్
on Mar 19, 2016
ఆడియో ఫంక్షన్ గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి గారు వస్తున్నారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన గబ్బర్ సింగ్ ఆయనే రిలీజ్ చేశారు. ఇది కూడా ఆయనే రిలీజ్ చేస్తారు అంటూ కన్ఫామ్ చేశారు పవన్. హిందీలో తను డబ్బింగ్ చెప్పట్లేదని, పాట కూడా భాష పై పట్టులేని కారణంగా హిందీలో పాడట్లేదని చెప్పుకొచ్చారు పవర్ స్టార్. సినిమాలో రాజకీయాలకు సంబంధించి ఏవీ ఉండవని, తాను సినిమాను కేవలం ఎంటర్ టైన్మెంట్ గా చూస్తానని, అందరికీ నచ్చుతుందని భావిస్తున్నానన్నారు. ఆడియో ఫంక్షన్ చేయడం తనకు ఇష్టం లేకపోయినప్పటికీ, ఫ్యాన్స్ కోసమే నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఓవరాల్ గా, రేపు మెగాపవర్ ను ఆడియో ఫంక్షన్లో చూడటం ఫ్యాన్స్ కు కనువిందే అని చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



