ఆటోడ్రైవర్ గా పవన్ కళ్యాణ్.. అభిమానుల్లో జోష్
on Oct 4, 2025

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)గత నెల సెప్టెంబర్ 25 న 'ఓజి'(OG)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఓజాస్ గంభీర్ అనే క్యారక్టర్ లో అద్భుతమైన పెర్ఫార్మ్ ని ప్రదర్శించి అభిమానులని, ప్రేక్షకులని అలరించాడు. వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద 'ఓజి' ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో పవన్ స్టామినా ఏంటో మరోసారి సిల్వర్ స్క్రీన్ కి చెప్పినట్లయింది.
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎంగా బాధ్యతలని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రీసెంట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)గారితో కలిసి 'ఆటో డ్రైవర్ పథకాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆటో కార్మికుడులా ఖాకీ డ్రస్ వేసుకొని మాట్లాడటం అభిమానుల్ని ఆకర్షిస్తుంది. పధకంలో భాగంగా ఆటో డ్రైవర్స్ కి,ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు అందనున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



