పాలిటిక్స్ మీద మరింత ఫోకస్.. షూటింగ్స్ త్వరగా ఫినిష్ చేసే పనిలో పవన్!
on Oct 21, 2021
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలున్నాయి. పొలిటీషియన్‌గా మారిన ఈ యాక్టర్.. ఒకవైపు పాలిటిక్స్‌తో, మరోవైపు యాక్టింగ్‌తో బిజీగా గడుపుతున్నారు. కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను తనకు, తన పార్టీ జనసేనకు అనుకూలంగా మలచుకోవాలని ఆశిస్తున్న ఆయన రాజకీయంగా మరింత బలోపేతం కావడంపై దృష్టి పెడుతున్నారు.
ప్రజల దృష్టిని మరింతగా ఆకర్షించేందుకు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై జనసేన దృష్టి పెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందనీ, వివిధ వర్గాల ప్రజలను ఉచిత తాయిలాలతో ఆకట్టుకోవడంపైనే ఫోకస్ పెట్టిన పాలక పార్టీ రాష్ట్రాన్ని ఎన్నడూ లేనంత అధోగతికి తీసుకుపోయిందనీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పవన్ కల్యాణ్ విమర్శల దాడి చేస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ కూడా పలు విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్రజలకు మరింత దగ్గరగా మెసలాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రజా కార్యక్రమాల్లో మరింతగా పాలుపంచుకోవడం ద్వారా జనసేనను గ్రౌండ్ లెవల్లో పటిష్ఠం చేయడానికి ఆయన ప్రణాళికలు చేపట్టబోతున్నారని ఆ వర్గాలు అంటున్నాయి. దాంతో రాజకీయంగా మరింత చురుగ్గా ఉండేందుకు ప్రస్తుతం తను చేస్తున్న, చేయబోతున్న సినిమాల షూటింగ్స్‌ను వేగంగా కంప్లీట్ చేయాలని ఇప్పటికే దర్శక నిర్మాతలకు ఆయన సూచించారు.
ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో 'భీమ్లా నాయక్' జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నది. ఆ వెంటనే క్రిష్ డైరెక్షన్‌లో చేస్తున్న 'హరిహర వీరమల్లు'ను పూర్తిచేసి, హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో 'భవదీయుడు భగత్‌సింగ్' షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
