ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన పవర్ స్టార్
on Oct 16, 2013

పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలై సూపర్ హిట్ అవడమే గాక బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. అయితే ఈ చిత్ర విజయంపై అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడానికి హైదరబాదులో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన సినిమాను పైరసీ చేసిన వారిని తీవ్రంగా హెచ్చరించారు.
ఈ సంధర్భంగా పవన్ మాట్లాడుతూ.... “అత్తారింటికి దారేది సినిమా పైరసీకి గురైన నేపధ్యంలో చిత్ర పరిశ్రమకే చెందిన కొందరు ప్రముఖులు సినిమాని ఐప్యాడ్స్‌లో డౌన్ లోడ్ చేసుకుని, డెస్క్ టాప్‌పై సినిమాని చూశారని, అంతే కాకుండా సినిమా చాలా బాగుందని, మీరేం కంగారు పడకండి, సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని వాళ్లు స్వయంగా తనకే ఫోన్ చేసి మరీ చెప్పారు. అసలు పైరసీని అరికట్టాల్సిందిపోయి, పైరసీని ప్రోత్సహించేలా డౌన్ లోడ్ చేసుకుని చూసి ఫోన్ చేసి మరీ చెప్పారంటే వాళ్ళని ఏం అనలో తెలియట్లేదు. ఒకరిద్దరయితే వారిని తప్పకుండా నిలదీసేవాడిని. కానీ ఇది తప్పని తెలిసినా కూడా అనేకమంది దానిని చూసి నన్నుఅభినందిస్తుంటే ఎందరిని నిలదీయగలము?

నేను వాళ్ళని అసలు మర్చిపోను. వారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. కానీ ఒకటే హెచ్చరిక.. "సహిస్తాం, పడతాం, భరిస్తాం..ఇక తప్పదు అనే స్థాయికి వస్తే మాత్రం చివరికి వాళ్ళ తాట తీస్తాం.." అంటూ పవన్ మాట్లాడేసరికి అభిమానులకు తెలియని కొత్త పవర్ వచ్చినట్లుగా అయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



