పవన్, రవితేజ.. రెండు కామన్ ఫ్యాక్టర్స్!
on Apr 11, 2021
2021 క్యాలెండర్ ఇయర్.. కొంతమంది ప్రముఖ కథానాయకులకు కమ్ బ్యాక్ ఇయర్ గా నిలుస్తోంది. చాన్నాళ్ళుగా విజయాలు లేని స్టార్స్ ఈ ఏడాదిలో సక్సెస్ చూస్తున్నారు. ముఖ్యంగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజా రవితేజకి ఇది గుర్తుండిపోయే సంవత్సరమే. సంక్రాంతికి విడుదలైన 'క్రాక్'తో రవితేజ బౌన్స్ బ్యాక్ కాగా.. సమ్మర్ స్పెషల్ గా రిలీజైన 'వకీల్ సాబ్'తో పవన్ రి-ఎంట్రీ ఇవ్వడమే కాకుండా చాన్నాళ్ళ తరువాత సక్సెస్ చూస్తున్నారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు చిత్రాలకు కూడా రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. అటు 'క్రాక్'కి, ఇటు 'వకీల్ సాబ్'కి యువ సంగీత సంచలనం తమన్ నే స్వరకర్త. ఈ రెండు సినిమాలకు కూడా తను అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఇక రెండో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే.. హీరోయిన్ శ్రుతి హాసన్. తన పాత్ర నిడివి, పరిధి.. ఇలాంటి విషయాలను పక్కనపెడితే ఈ రెండు సినిమాల్లోనూ ఈ కామన్ ఫ్యాక్టర్ బాగానే వర్కవుట్ అయింది.
మొత్తమ్మీద.. పవన్, రవితేజకి తమన్, శ్రుతి అనే రెండు కామన్ ఫ్యాక్టర్స్ బాగానే అచ్చొచ్చాయి.
Also Read