రక్తం కారేట్లు కొట్టుకొని, అలసిపోయి పడుకున్న.. భీమ్లా-డేనియల్!
on Oct 21, 2021
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషిస్తోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. యస్సైగా టైటిల్ రోల్‌లో పవన్ నటిస్తుంటే, ఆయనను ఢీకొట్టే మాజీ హవల్దార్ డేనియల్ శేఖర్ క్యారెక్టర్‌ను రానా చేస్తున్నాడు. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు 'భీమ్లా నాయక్' రీమేక్.
ఈ సినిమాకు సంబంధించిన ఇంతదాకా రిలీజ్ చేసిన టీజర్స్ కానీ, సాంగ్స్ కానీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. మొదట టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తే.. అది బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఇటీవల రిలీజ్ చేసిన "అంత ఇష్టం" పాట కూడా సంగీత ప్రియులను అలరిస్తోంది. ఈ సాంగ్‌ను భార్యాభర్తలుగా నటిస్తోన్న నిత్యా మీనన్, పవన్ కల్యాణ్‌పై చిత్రీకరించారు.
కాగా ఈ సినిమాలో పవన్, రానాపై రెండు యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి మార్కెట్‌లో జనం మధ్య ఉంది. ఇది క్లైమాక్స్‌లో వస్తుంది. ఆ ఫైట్ చిత్రీకరణ సందర్భంగా షాట్ గ్యాప్‌లో పవన్, రానా రిలాక్స్ అవుతున్న పిక్చర్‌ను డైరెక్టర్ సాగర్ చంద్ర తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. ఆ ఫొటోలో నులక మంచం మీద పవన్ పడుకొని ఉంటే, దాని పక్కనే ఉన్న ఎడ్లు లేని బండిపై స్టైల్‌గా పడుకొని ఉన్నాడు రానా. ఇద్దరి దుస్తులపై నెత్తుటి మరకలు కనిపిస్తున్నాయి. ఆ ఫొటో చూస్తుంటే.. బాగా కొట్టుకొని అలసిపోయి పడుకున్నట్లుగా కనిపిస్తున్నారు ఆ ఇద్దరూ. ఈ ఫొటోకు "Unwinding off the camera #BheemlaNayak & #DanielShekar " అనే క్యాప్షన్ జోడించాడు సాగర్ చంద్ర. నిమిషాల వ్యవధిలోనే ఈ ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
తమన్ సంగీతం సమకూరుస్తున్న 'భీమ్లా నాయక్'కు రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ రాస్తున్న ఈ మూవీని 2022 జనవరి 12న విడుదల చేయడానికి నిర్మాత సూర్యదేవర నాగవంశీ సన్నాహాలు చేస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
