రిపీట్ మోడ్లో కృతి సనన్!
on Oct 21, 2021
కథానాయికగా కృతి సనన్ ది ఏడేళ్ళ సినీ ప్రస్థానం. ఈ ప్రయాణంలో హిందీ, తెలుగు భాషల్లో కలిపి మొత్తం 11 చిత్రాల్లో హీరోయిన్ గా సందడి చేసింది కృతి. అలాగే 4 హిందీ చిత్రాల్లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడీ అమ్మడి ఖాతాలో ఐదు బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి. వాటిలో ఓ చిత్రం.. ఈ నెల 29న ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. మిగిలిన నాలుగు చిత్రాలు కూడా 2022లో తెరపైకి రాబోతున్నాయి.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. వీటిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా దర్శనమివ్వనున్న `ఆదిపురుష్`ని మినహాయిస్తే.. మిగిలిన నాలుగు చిత్రాల్లోనూ ఆల్రెడీ నటించిన కథానాయకులతోనే జట్టుకట్టింది కృతి. స్ట్రీమింగ్ కి రెడీ అయిన `హమ్ దో హమారా దో` కోసం `బరేలీ కీ బర్ఫీ` కో-స్టార్ రాజ్ కుమార్ రావ్ తో మరోమారు జోడీకట్టిన మిస్ సనన్.. `బచ్చన్ పాండే` కోసం `హౌస్ ఫుల్ 4` కో-స్టార్ అక్షయ్ కుమార్ తో సెకండ్ టైమ్ ఆడిపాడనుంది. ఇక `భేడియా` విషయానికి వస్తే.. ఇందులో `దిల్ వాలే` జోడీ వరుణ్ ధావన్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది కృతి. అలాగే, `షెహ్జాదా` కోసం `లూకా చుప్పీ` స్టార్ కార్తిక్ ఆర్యన్ కి జతగా ఎంటర్టైన్ చేయనుంది.
మొత్తమ్మీద.. కృతి సనన్ నుంచి రాబోయే చిత్రాల్లో `ఆదిపురుష్`ని మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా ఆయా హీరోలతో రిపీట్ మోడ్ మూవీస్ కావడం గమనార్హం. మరి.. వీటిలో ఏయే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తాయో చూడాలి.
Also Read