పవన్-సుజీత్ మూవీ లాంచ్ కి ముహూర్తం ఖరారు!
on Jan 27, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కలయికలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందనున్న ఈ మూవీ ప్రకటన డిసెంబర్ లో వచ్చింది. "వారు అతనిని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని పిలుస్తారు" అంటూ విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాలకు బ్రేక్ ఇచ్చి, ముందుగా ఈ సినిమాను పట్టాలెక్కించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్. జనవరి 30న ఈ మూవీ పూజాకార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ కానుందని సమాచారం. మరి అదే జోష్ లో షూటింగ్ కూడా వెంటనే మొదలు పెడతారేమో చూడాలి.
పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వలో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే చిత్రాన్ని ప్రకటించాడు. ఇది తమిళ్ మూవీ 'తేరి'కి రీమేక్ అని సమాచారం. అలాగే సాయి ధరమ్ తేజ్ తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో 'వినోదయ సిత్తం' రీమేక్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
