డబుల్‌తో బాలయ్య హ్యాట్రిక్ కొడతాడా?!
on Jan 27, 2023
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాలలో ఎక్కువ ద్విపాత్రాభినయాలు కనిపిస్తూ ఉంటాయి. ఓల్డ్ బాలకృష్ణ న్యూ బాలకృష్ణగా ఆయన సినిమాలు ఉంటాయి. ఇక అఖండ చిత్రంతో పాటు వీరసింహారెడ్డి లో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ రెండు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్టుగా నిలిచి బాలయ్యకు వరుసగా రెండు విజయాలను కట్టబెట్టాయి. ఇలాంటి సమయంలో ఆయన పటాస్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు వంటి ఫ్యామిలీ ఎంటర్టైలర్ను అందించారు.
ఇక ఈయన తీసిన సుప్రీం, రాజా ది గ్రేట్ కూడా బాగానే ఆడాయి. ప్రస్తుతం f3 తో కాస్త వెనుకబడిన అనిల్ రావిపూడి బాలయ్య చిత్రంతో బౌన్స్ బ్యాక్ కావడం ఖాయమని అంటున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో అందునా తెలంగాణ యాసలో ఈసారి బాలయ్య తన పవర్ఫుల్ డైలాగ్‌లను ఎలా వినిపిస్తాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ఇదే నెలలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల అది ఆలస్యం అయ్యింది.
ఇక ఈ చిత్రంలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తాడట. పెద్ద బాలయ్యకు కూతురుగా శ్రీలీలా నటిస్తోందని సమాచారం. ఇక పెద్ద బాలయ్యకు కాజల్ అగర్వాల్ జోడిగా ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా బాలయ్య వరుసగా ద్విపాత్రాభినయాలు చేస్తూ ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఆయన మరోసారి ద్విపాత్రాభినయంగా డబుల్ యాక్షన్ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయితే బ్యాక్ టు బ్యాక్ మూడు చిత్రాలలో ద్విపాత్రాభినయం చేసి సూపర్ హిట్స్ ను నమోదు చేసుకున్న హీరోగా నందమూరి బాలయ్య నిలిచిపోతారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
