బాలీవుడ్‌లో సర్దార్ ఎలా ఉన్నాడు
on Apr 4, 2016
.jpg)
టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్‌కి తిరుగులేని ఇమేజ్ ఉంది. అదెవరూ కాదనలేని సత్యం! సర్దార్ - గబ్బర్‌సింగ్ కోసం పవన్ అభిమానులే కాదు, యావత్ తెలుగు సినిమా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. విదేశాల్లో ఉంటున్న తెలుగు సినీ అభిమానులు కూడా సర్దార్ గబ్బర్‌సింగ్ అద్భుతాలు సృష్టిస్తాడన్న అంచనాలతో ఉంది. సర్దార్ కాస్త యావరేజ్‌గా ఉన్నా దుమ్ము దులపడం ఖాయం. కానీ.. బాలీవుడ్‌లో మాత్రం సర్దార్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యే సూచనలు ఉన్నాయన్నది ఇండ్రస్ట్రీ వర్గాల మాట. బాహుబలి బాలీవుడ్‌లో డబ్బింగ్ రూపంలో వెళ్లి, కోట్లు కొల్లగొట్టుకొచ్చింది. ఆ స్ఫూర్తితోనే గబ్బర్‌సింగ్‌ని కూడా హిందీ లో అనువదించి విడుదల చేస్తున్నారు. బాహుబలి అంత కాకపోయినా.. అందులో 25 % అయినా సర్దార్ వసూలు చేస్తుందని చిత్రబృందం ఆశలు పెట్టుకొంది. అయితే ఆ ఆశలు ఆడియాశలు అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణాలూ లేకపోలేదు.
సర్దార్ హిందీ వెర్షన్ రైట్స్ కొనడానికి బాలీవుడ్ నుంచి ఏ నిర్మాతా, పంపిణీదారుడూ ముందుకు రాలేదు. కనీసం కనీస రేటుకు కొనడానికి ధైర్యం చూపించలేదు. దాంతో.. ఈ సినిమా నిర్మాణ భాగస్వామి అయిన ఈరోస్ సంస్థే.. సొంతంగా ఈ సినిమాని హిందీలోకి విడుదల చేసుకొంటోంది. బాలీవుడ్‌లో ఏ సినిమా వచ్చినా అడ్వాన్సు బుకింగుల హంగామా మొదలైపోతుంది. కానీ.. సర్దార్ అడ్వాన్స్ బుకింగ్ అన్నమాటకి ఆమడ దూరంలో నిలిచింది. థియేటర్లు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదట. హెవీ అడ్వాన్సులు చేతిలో పెట్టి... ఈ సినిమాని బాలీవుడ్‌లో బలవంతంగా రిలీజ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. హోర్డింగుల కోసం భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నార్ట. హిందీ ఛానల్స్‌లోనూ ప్రచారం పెద్ద ఎత్తున సాగిస్తున్నట్టు టాక్. బాలీవుడ్ ప్రమోషన్లకే ఏకంగా రూ.6 కోట్ల వరకూ ఖర్చు పెడుతున్నారట.
బాహుబలికి ముందూ తరవాత ఏ తెలుగు సినిమా అక్కడ ఒకట్రెండు కోట్లకు మించి వసూళ్లు సాధించలేదు. పులి, రుద్రమదేవి చిత్రాలూ భారీ స్థాయిలో విడుదలయ్యాయి. కానీ.. పోస్టర్ డబ్బులూ రాలేదు. ఇప్పుడు సర్దార్ పరిస్థితీ అంతేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాజల్ తప్ప.. ఈ సినిమాలో తెలిసిన మొహాల్లేవు. పైగా ఇదో ఫక్తు కమర్షియల్ సినిమా. ఈ టైపు చిత్రాలు బాలీవుడ్ లో చాలా వచ్చాయి. సర్దార్‌నీ హిందీ ప్రేక్షకులు ఆ గాడినే కట్టే సే ప్రమాదం ఉందని ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



