ఐశ్వర్యతో హోలాండ్.. ప్రియాంకతో ఒబామా
on Apr 4, 2016
.jpg)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్ ప్రాంకోయిస్ హోలాండ్ ప్రపంచాన్ని కనుసైగతో శాసించగల అగ్రదేశాధినేతలు. వీరితో పరిచయం కావాలని దేశాధినేతల నుంచి ప్రముఖుల వరకు తహతహలాడతారు. అయితే వీరు మాత్రం బాలీవుడ్ భామలతో ముచ్చటించాలని కోరుకుంటున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గతంలోనూ వర్తమానంలోనూ జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఈ సంవత్సరం భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ఫ్రాంకోయిస్ హోలాండ్ గౌరవార్థం భారత ప్రభుత్వం విందును ఏర్పాటు చేసింది.
అయితే ఈ విందుకు హాజరు కావాల్సిందిగా ఐశ్వర్యరాయ్‌కి ఆహ్వానం అందింది. ఫ్రాన్ ప్రభుత్వం రెకమండేషన్‌తోనే ఇన్విటేషన్ వెళ్లిందని అప్పట్లో వార్తలు నడిచాయి. ఈ విందులో ఐశ్వర్య ప్రత్యక ఆకర్షణగా నిలిచారు. రెడ్ కలర్ బెనారస్ పట్టుచీరలో భారతీయ సంస్కృతి మూర్తీభవించిన నిండు మహిళగా ఐశ్వర్య సందడి చేశారు. ఓ టేబుల్ వద్ద ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్, ఐశ్వర్య ముచ్చట్లు చెప్పుకున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇప్పుడు ఈ కోవలోకి మరో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వచ్చి చేరారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన సతీమణి మిషెల్ ఒబామాలతో కలిసి విందులో పాల్గొనాల్సిందిగా ప్రియాంకు వైట్‌హౌస్ నుంచి ఆహ్వానం అందింది. అయితే ప్రియాంకతో పాటు హాలీవుడ్ ప్రముఖులు బ్రాడ్లీ కూపర్, లూసీ లియూ, జేన్ ఫోండా, గ్లాడిన్ వైట్‌లు కూడా శ్వేత సౌధం నుంచి ఆహ్వానం అందుకున్నారు. ప్రపంచం మొత్తం అగ్రదేశాధినేతల చుట్టూ తిరుగుతుంటే వీరు మాత్రం మన బాలీవుడ్‌ను కోరుకోవడం, భారతీయ చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



