సెల్ఫీకి ముందు అడగలేదని తోసేశాడు..!
on May 18, 2016

పరేశ్ రావల్ గుర్తున్నాడా..? క్షణ క్షణం, మనీ, తీన్ మార్ లాంటి సినిమాల్లో తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. గోపాల గోపాల లో వెంకటేష్ చేసిన పాత్రను హిందీ ఒరిజినల్ లో చేసింది పరేష్ రావలే. సహజంగా చాలా కామ్ గా ఉండే పరేష్, ఒక అభిమాని మీద కోపం తెచ్చుకున్నాడు. ఏకంగా పక్కకు తోసేశాడు. విషయంలోకి వెళ్తే, సోమవారం రాత్రి ముంబై ఎయిర్ పోర్ట్ కు వచ్చిన పరేష్, ఎవరి కోసమో ఎదురుచూస్తూ ఫోన్ మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఒక అభిమాని వచ్చి, కనీసం ఆయన అనుమతి కూడా లేకుండానే, పక్కకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించడంతో, కోపమొచ్చిన పరేష్ అతన్ని చిరాగ్గా పక్కకు తోసేసి వెళ్లిపోయారు. ఈ దెబ్బతో అవాక్వవడం అభిమాని వంతయ్యింది. పరేష్ ఎవరి కోసమో ఎదురుచూస్తూ కోపంగా ఫోన్ మాట్లాడుతున్న సమయంలో అభిమాని దగ్గరకు వెళ్లాడు. సెల్ఫీ కోసం అనుమతి అడక్కుండా తీసుకోవడానికి ట్రై చేసిన కారణంగానే ఆయనకు చిరాకు వచ్చింది అంటూ ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. రీసెంట్ గా అక్షయ్ కుమార్ తో ఒక ఫ్యాన్ సెల్ఫీ తీసుకోబోతే, ఆయన బాడీగార్డ్ అభిమానిని కొట్టిన సంగతి తెలిసిందే. ముంబై ఎయిర్ పోర్ట్ లలో ఈ సెల్ఫీల గోల సెలబ్రిటీలకు ఎక్కువగానే ఉంటుంది. అయితే మాట మాత్రమైనా అడక్కుండా, ఫోటోకు ట్రై చేయడం అభిమాని తప్పైతే, అతన్ని పక్కకు నెట్టడం పరేష్ తప్పు అంటున్నారు చూసినవాళ్లు. అంతే లెండి..సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



