భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ!
on Apr 28, 2025
నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. ఏప్రిల్ 28 సాయంత్రం ఢల్లీిలోని రాష్ట్రపతి భవన్‌లో భారత దేశపు మూడవ అత్యున్నత పురస్కారం ‘పద్మభూషణ్’ భారత రాష్ట్రపతి దౌపది ముర్ము నందమూరి బాలకృష్ణకు అందించారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలకృష్ణకు అభినందనలు తెలియజేశారు. 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమకు చేస్తున్న సేవలు, బసవతారకం హాస్పిటల్ ద్వారా, మూడు దఫాలుగా హిందూపూర్ ఎమ్మెల్యేగా ప్రజలకు చేస్తున్న సేవలకుగాను భారత ప్రభుత్వం ఈ అవార్డును అందించింది. బాలయ్యతో పాటుగా తమిళ హీరో అజిత్ కుమార్, కన్నడ నటుడు అనంత్ నాగ్, బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్‌లకు కూడా పద్మభూషణ్‌ను ప్రదానం చేసారు. దివంగత గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్‌కు మరణానంతరం ఈ గౌరవం దక్కింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



