అన్నపూర్ణ స్టూడియోను చుట్టి ముట్టిన ఓయూ స్టూడెంట్స్!!
on Jul 20, 2019
మరి కొన్ని గంటల్లోనే బిగ్ బిస్ సీజన్ 3 ప్రారంభం కానున్న సమయంలో వివాదాలు బిగ్ బిగ్ చుట్టూ వేగంగా అల్లుకుంటున్నాయి. ఇప్పటికే గాయత్రి గుప్త, శ్వేత రెడ్డి, కేతిరెడ్డి తదితరులు కేసులు పెట్టి బిగ్ బిస్ ను వివాదాల పాలు చేసారు. బిగ్ బాస్ లాంటి షోస్ వల్ల యూత్ పెడదోవ పడుతుందంటూ కేతి రెడ్డి తెలంగాణ హై కోర్టులో పిటిషన్ వేసారు. ఇక దీనికి సపోర్ట్ చేస్తూ ఓయూ స్టూడెంట్స్ కూడా బిగ్ బాస్ పై కన్నెర్ర చేస్తూ షోను విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు. బిగ్ బాస్ స్టార్ట్ కాకుండా నిలిపివేయడానికి ఓయూ విద్యార్థులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు బంజారాహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోను చుట్టుముట్టారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహక కార్యాలయ్యాన్ని, నాగార్జున ఇంటిని కూడా ముట్టడించే అవకాశాలు కూడా ఉండటంతో ఈ రెండు చోట్ల పోలీస్ సెక్యూరిటీని కల్పించారు. దీంతో బిగ్ బాస్ షో ప్రారంభం వాయిదా పడే అవకాశాలున్నట్లు కొంత అంటున్నారు. చూద్దాం చివరకు ఎలా ఉంటుందో మరి.