అడివి శేష్‌కి సమంత సెంటిమెంటా?
on Jul 20, 2019
అడివి శేష్ నటిస్తున్న తాజా సినిమా 'ఎవరు'. శుక్రవారం టీజర్ విడుదలైంది. ఈ కార్యక్రమానికి సమంత ముఖ్య అతిథిగా విచ్చేశారు. తనకు టీజర్ నచ్చిందని, అడివి శేష్ కొత్త కంటెంట్‌తో సినిమాలు తీస్తున్నాడని, ఇండస్ట్రీని ముందుకు తీసుకు వెళ్తున్నాడని సమంత ప్రశంసల వర్షం కురిపించారు. 'ఎవరు'కు ముందు అడివి శేష్ నటించిన సినిమా 'ఓ బేబీ'. అందులో అతడిది అతిథి పాత్రే. సమంతతో స్నేహం కారణంగా చిన్న పాత్రలో నటించాడని అనుకోవచ్చు. ఎందుకంటే... శేష్‌కి సమంత సెంటిమెంట్ అని ఇండస్ట్రీ టాక్.
తన ప్రతి సినిమా టీజర్‌ను సమంతతో విడుదల చేయిస్తున్నాడు మరి. 'ఎవరు' చిత్రానికి ముందు అడివి శేష్ సోలో హీరోగా నటించిన సినిమా 'గూఢచారి'. సమంతే ఆ సినిమా టీజర్ విడుదల చేశారు. అంతకు ముందు సోలో హీరోగా నటించిన సినిమా 'క్షణం' టీజర్‌నూ సమంతే విడుదల చేశారు. 'బ్రహ్మోత్సవం' సెట్‌లో మహేష్ బాబుతో కలిసి! అడివి శేష్ నెక్స్ట్ సినిమా టీజర్ కూడా సమంత విడుదల చేస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. 'ఎవరు' టీజర్ విషయానికి వస్తే... కొత్త కాన్సెప్ట్‌తో మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌తో అడివి శేష్ వస్తున్నట్టున్నాడు. ప్రేక్షకుల్లో ఈ టీజర్ ఆసక్తి రేపింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
