ఓజి vs పులివెందుల.. ఏం జరగబోతుంది!
on Sep 19, 2025

'ఓజి'(Og)తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఈ నెల 25 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. దీంతో అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకి తెరపడనుంది. అభిమానుల్లో ఈ మూవీకి ఎంత క్రేజ్ అంటే, గత రెండున్నర ఏళ్లుగా, పవన్ ఏ సినిమా ఫంక్షన్ లో కనపడినా, పొలిటికల్ గా మీటింగ్ లలో పాల్గొన్నా, ఓజి, ఓజి అని అరవడం ఆనవాయితీగా వస్తుంది. పవన్ గత చిత్రం 'హరిహరవీరమల్లు' రిలీజ్ టైం లో కూడా ఓజీ కోసమే తమ ఎదురుచూపులని చాలా మంది ఫ్యాన్స్ చెప్పారు. 'ఓజి' వాళ్ళల్లో అంత బలంగా నాటుకుపోయింది. ఇందుకు కారణం వాళ్ళ దృష్టిలో 'ఓజి' అంటే ఒరిజినల్ గాడ్. టైటిల్ అనౌన్స్ చేసినప్పట్నుంచి, రాజకీయంగాను, వ్యక్తిగతంగాను పవన్ చేస్తున్న సేవా కార్యక్రమాల దృష్ట్యా 'ఒరిజినల్ గాడ్ అని పిలుచుకుంటు వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతంలోని 'పులివెందుల'(Pulivendula)టౌన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత సంతరించుకుందనే వార్తలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.ఇందుకు ప్రధాన కారణం పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గానికి 'వైఎస్ఆర్ సీపీ పార్టీ' అధినేత 'వైఎస్ జగన్'(Ys Jagan)ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పొలిటికల్ గా జగన్, పవన్ కి ఉన్న వైర్యం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులు జగన్ ని విమర్శిస్తూ,పవన్ నో ఒరిజినల్ గాడ్ అంటుంటారు. జగన్ అభిమానులు కూడా జగన్ ని ఒరిజినల్ గాడ్ అని పిలుచుకుంటారు. ఈ నేపథ్యంలో 'ఓజి' పులివెందులలో ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కి పులివెందులలో అభిమాన ఘనం ఎక్కువే మంది ఉన్నారు. పవన్ గత చిత్రాల ద్వారా ఈ విషయం రుజువు అయ్యింది
పులివెందుల లో మొత్తం పది వరకు థియేటర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓజి కి ఉన్న క్రేజ్ దృష్ట్యా పది థియేటర్స్ లోను ఓజి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ రోజు ముందు రాత్రి బెనిఫిట్ షో కి పర్మిషన్ ఇచ్చింది. టికెట్ రేట్ ని 1000 రూపాయలగా ఉండగా, ఆ తర్వాత పది రోజుల పాటు ఐదవ ఆటలకి అనుమతి ఇస్తు రెగ్యులర్ గా ఉండే రేట్స్ కంటే కొంచం పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తు ఉత్తర్వులు జారీ చేసింది .
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



