రోబో శంకర్ మృతి.. కమల్ హాసన్ స్పందన ఎలా ఉందో చూడండి
on Sep 19, 2025

లోకనాయకుడు 'కమల్ హాసన్'(Kamal Haasan)ఈ ఏడాది జూన్ లో 'థగ్ లైఫ్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మూవీ డిజాస్టర్ గా నిలిచినా, కమల్ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. నిన్న తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన కామెడీ నటుడు 'రోబో శంకర్' ఒక సినిమా షూటింగ్ లో ఉండగా కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో యూనిట్ సభ్యులు హాస్పిటల్ లో చేర్పించారు. చివరకి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు.
ఈ విషయంపై కమల్ హాసన్ స్పందిస్తు 'రోబో శంకర్(Robo Shankar)అనేది పేరు మాత్రమే. నువ్వు నా తమ్ముడువి, నన్నువదిలిఎలా వెళ్తావు. ఇక్కడ నీ పని పూర్తయింది, వెళ్ళిపోయావు. కానీ నా పని ఇంకా మిగిలే ఉందంటు భావోద్వేగ పోస్ట్ చేసాడు. ధనుష్ తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు రోబో శంకర్ మృతి పట్ల తమ సానుభూతిని తెలియచేస్తున్నారు. ఈ రోజు చెన్నై లోని 'వలసర వక్కం' లో రోబో శంకర్ అంత్యక్రియలు జరగనున్నాయి.
రెండున్నర దశాబ్డల క్రితమే తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన రోబో శంకర్ దాదాపుగా అందరి అగ్ర హీరోల చిత్రాల్లో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో, తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. మారి, విశ్వాసం, వేలైక్కారన్ చిత్రాలు రోబో శంకర్ కి మంచి పేరు తెచ్చిపెట్టగా, రెండు వందల సినిమాల వరకు రోబో శంకర్ ఖాతాలో ఉన్నాయి. జాండిస్ వాళ్ళ చనిపోవడం జరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



