'ఆచార్య' ఎఫెక్ట్.. NTR 30 సెట్స్ మీదకు వెళ్లేది సెప్టెంబర్‌లోనే!
on Jul 9, 2022

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన 'జనతా గ్యారేజ్' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. 'ఆర్ఆఆర్ఆర్' మూవీ తర్వాత కొరటాల డైరెక్షన్‌లో' NTR 30'ని చేసేందుకు డిసైడ్ అయ్యాడు తారక్. ఈ నెల్లోనే ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. అయితే కొరటాల శివ కారణంగా ఈ మూవీ షూటింగ్‌లో జాప్యం జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
చిరంజీవి, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో తను తెరకెక్కించిన 'ఆచార్య' మూవీకి సంబంధించిన సమస్యల్లో తలమునకలై ఉన్నాడు కొరటాల శివ. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు 60 శాతం పైగా నష్టాలు చవిచూశారు. దాంతో నిర్మాతలు వారి నష్టాల్లో కొంత భరించడానికి రెడీ అయ్యారు. ఆ సినిమా బిజినెస్‌లో కొరటాల కూడా భాగం పంచుకోవడం వల్ల, డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లించే విషయాన్ని కూడా అతను చూసుకుంటున్నాడు. ఇప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదంటున్నారు. ఇది 'NTR 30' షూటింగ్ షెడ్యూళ్లపై ప్రభావం చూపుతోందని వినిపిస్తోంది. ఈ నెల్లోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లాల్సి వుండగా, ఇప్పుడు అది సెప్టెంబర్‌కు వాయిదా పడిందని అంతర్గత వర్గాలు అంటున్నాయి.
కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంత పేరు ప్రచారంలోకి వచ్చింది. అందులో నిజం లేదనీ, ఇంకా హీరోయిన్ ఎంపిక పూర్తి కాలేదనీ తెలిసింది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



