టెన్షన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఇన్ని సినిమాల మధ్య ఆ సినిమా చేస్తారా?
on Jul 24, 2025
ఎన్టీఆర్ తాజా చిత్రం ‘వార్2’ ఆగస్ట్ 14న విడుదలకు సిద్ధమవుతోంది. హృతిక్‌రోషన్‌తో కలిసి తొలిసారి హిందీ సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ను త్వరలో స్టార్ చేయబోతున్నారు. ‘వార్2’ రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌పై కాన్‌సన్‌ట్రేట్ చేయబోతున్నారు ఎన్టీఆర్. 2026 జూన్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దాంతో నాన్‌స్టాప్‌గా షెడ్యూల్స్ చేసి సినిమాని పూర్తి చేస్తారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్‌లో చేసే సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇది పౌరాణిక చిత్రం కావడంతో ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది చివరలో స్టార్ట్ చేస్తారు. అలాగే జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో కూడా ఒక సినిమా చేయబోతున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు.
ఇదిలా ఉంటే.. గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించిన ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ ‘దేవర’కి సీక్వెల్ కూడా ఉందన్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా సంగతేమిటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే డౌట్ కూడా అభిమానుల్లో ఉంది. అయితే తప్పకుండా దేవర2 ఉంటుందని గతంలో ఎన్టీఆర్ కూడా ప్రకటించారు. కొరటాల శివ సీక్వెల్‌కి సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ చేశారు. ఎన్టీఆర్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేస్తే కానీ ఈ సినిమా మొదలుపెట్టే అవకాశం లేదు. ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ సినిమాలు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. అప్పటివరకు దేవర2 మొదలు కాదు. ఒకవేళ త్రివిక్రమ్ సినిమా లేట్ అయితే కొరటాల శివకు టైమ్ దొరుకుతుంది. వెంకటేష్‌తో త్రివిక్రమ్ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త్వరగానే పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ చేసే సినిమాకి కొంత గ్యాప్ ఉండే అవకాశం ఉందని, ఆ గ్యాప్‌లో దేవర2ని పూర్తి చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



