తాత క్రెడిట్ కొట్టేశాడు
on Jul 7, 2017
.jpg)
తాతను బాగానే ఫాలో అవుతున్నాడు తారక్. ‘జై లవకుళ’టీజర్ చూస్తే అది ఈజీగానే అర్థమవుతుంది. ఆ కొనదేరిన మీసం... తీక్షణమైన చూపులు... కరుడుగట్టిన కాఠిన్యం... ఇవన్నీ చూస్తుంటే మీకెవరు గుర్తొస్తున్నారు? సీతారామకళ్యాణం, శ్రీకృష్ణ పాండవీయం, దానవీరశూరకర్ణ, శ్రీ మద్విరాటపర్వం చిత్రాల్లో ఎన్టీయార్ గుర్తుకురావడం లేదు..! అసలు విలన్ కి హీరో ఇమేజ్ తెచ్చిపెట్టింది ‘అన్న’నందమూరే కదా. విడ్డూరం కాకపోతే... దుర్యోధనుడికి డ్యూయెట్ ఏమిటి? అది కూడా ఆరాధనతో చూసేశారు జనాలు. ఎన్టీయార్ అంటే అది.
ఇప్పుడు తారక్ తీరు కూడా అలాగే కనిపిస్తుంది. తాతగారిని ఫాలో అవుతూ... విలన్, హీరో రెండూ తానే అయి నటిస్తున్నాడు. పైగా ‘దానవీర శూర కర్ణ’రేంజ్ లో త్రిపాత్రాభినయం. తారక్ కి కూడా ఎప్పట్నుంచో ‘దానవీర శూర కర్ణ’చేయాలని కోరిక. ఓ విధంగా తారక్ చేయాలనుకున్న ‘డీవీఎస్ కర్ణ’కు ఈ ‘జై లవకుశ’... ప్రిపరేషన్ లాంటిదనుకోవచ్చు.
ఏది ఏమైనా టీజర్ లో తారక్ నటన మాత్ర అదుర్స్. ‘రావణున్ని సంపాలంటే సముద్రం దాటి రావాల... ఈ రావణున్ని సంపాలంటే... సముద్రమంత గుండె కావాల... ఉందా’ అంటుంటే... తారక్ లో ఇంత విలన్ ఉన్నాడా? అనిపించింది. తాత రక్తం ఎక్కడికి పోతుంది. త్రిపాత్రాభినయం చేస్తూ... రెండు మంచి పాత్రలు, ఓ పాత్రను విలన్ గా చేసిన క్రెడిట్ ఇప్పటివరకూ మహానటుడు ఎన్టీయార్ దే.
‘జై లవకుశ’ చిత్రంలో తారక్ త్రిపాత్రాభినయం చేశాడంటున్నారు. అందులో తొలివాడి పేరు ‘జై’అని. అది విలన్ పాత్ర. లవకుశ ఇద్దరూ మంచి పాత్రలు అని టాక్. ఇదే నిజమైతే తాత తర్వాత ఆ క్రెడిట్ కొట్టేసిన ఘనత మనవడు తారక్ కే దక్కుతుంది.
అసలు ‘జై’ పాత్రకు సంబంధించిన టీజర్ నే ముందు ఎందుకు విడుదల చేశారు? దర్శకుడు బాబీ స్టాటజీ ఏంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సినిమాపై సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలే నిజమైతే.. ఇక ఆ లవకుశలు ఎలా ఉంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



