ఎన్టీఆర్ కు మెగాహీరోల విషెస్...!
on May 20, 2016

మెగా, నందమూరి కుటుంబాల మధ్య ఉన్న పోటీ ప్రొఫెషనల్ గానే తప్ప పర్సనల్ గా కాదు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చిరు, బాలయ్యలు ప్రూవ్ చేశారు. తాజాగా నెక్స్ట్ జనరేషన్ యంగ్ హీరోలు కూడా ఈ విషయంపై చాలా క్లారిటీగా ఉన్నారు. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ లు ఎన్టీఆర్ కు తమ పుట్టిన రోజు విషెస్ తెలిపారు. అంతేకాదండోయ్..జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ అదిరిందంటూ బన్నీ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. రీసెంట్ గా ఒకమనసు ఆడియోలో, బయటి వాళ్ల వేడుకలో అల్లరి చేయకండి అంటూ హిత బోధ చేసిన బన్నీ, తాను చెప్పిన మాటకు తనే ముందడుగు వేసే ప్రయత్నం చేశాడు.

హ్యాపీ బర్త్ డే తారక్. హోప్ యు హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ లవ్ లీ ఇయర్ ఎహెడ్. బైదవే, ఫస్ట్ లుక్ ఈజ్ సూపర్ అంటూ ట్వీట్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇక మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అయితే, జనతా గ్యారేజ్ పోస్టర్లో ఎన్టీఆర్ అనే ఒక ఎనర్జీ కనిపిస్తోంది. హ్యాపీ బర్త్ డే తారక్ అంటూ మనస్ఫూర్తిగా విష్ చేశాడు. ఈ విధంగా హీరోలే ముందడుగు వేసి, తమ అభిమానులు ఎలా ఉండాలో ఆదర్శంగా చూపిస్తున్నారు. ఇండస్ట్రీకి ఇలాంటి యువ హీరోలు దొరకడం శుభపరిణామం అంటున్నారు సినీ పెద్దలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



