సర్ ప్రైజ్.. రేపే 'NKR 19' ఫస్ట్ లుక్!
on Nov 6, 2022

ఇటీవల 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ అందుకొని జోరు మీదున్న నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలో మరో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 19వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి రాజేంద్ర రెడ్డి దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది.
ఈ మూవీ టైటిల్ ని, ఫస్ట్ లుక్ రేపు(సోమవారం) ఉదయం 10:08 కి రివీల్ చేయబోతున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి 'ఎమిగోస్' అనే విభిన్న టైటిల్ ని పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. మరి అదే టైటిల్ పెట్టారో లేక మరేదైనా టైటిల్ పెట్టారో అనేది రేపు తేలిపోతుంది. అలాగే ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు కూడా న్యూస్ వినిపిస్తోంది. ఫస్ట్ లుక్ తో దీనిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

దీనితో పాటు 'డెవిల్' అనే ఓ పీరియాడిక్ ఫిల్మ్ కూడా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. 'బింబిసార' షూటింగ్ ని సైలెంట్ గా పూర్తి చేసి, విడుదలకు ముందు మంచిగా ప్రమోట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



