వినాయక్ క్లాప్ తో మొదలైన నాగశౌర్య కొత్త చిత్రం!
on Nov 6, 2022

నాగశౌర్య హీరోగా నటిస్తున్న 24వ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా నాగశౌర్య హీరోగా ఈ సినిమా రూపొందనుంది. ఎస్.ఎస్.అరుణాచలం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఆదివారం నాడు గ్రాండ్ గా లాంచ్ అయింది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ఈ కార్యక్రమం జరిగింది. దర్శకుడు వీవీ వినాయక్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టగా.. నిర్మాత అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.

శ్రీనివాసరావు, విజయకుమార్, అశోక్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి హ్యారిస్ జైరాజ్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా వెట్రి పళనిస్వామి, ఎడిటర్ గా ఛోటా కె.ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



