నేను తెలుగు మూవీస్ చూడను..నాకు ప్రభాస్ ఎవరో తెలీదు!
on Nov 19, 2022
.webp)
నిత్యా మీనన్ ‘అలా మొదలైంది’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నేచురల్ స్టార్ నానితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. చాలా తక్కువ మూవీస్ ఐనా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించింది నిత్యా. ఐతే తాను తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
హీరో ప్రభాస్ విషయం ఆమె ఇబ్బందులు పడింది. అసలు ప్రభాస్ విషయంలో ఏం జరిగింది..? ఎందుకు ఆమె అంతగా బాధపడింది.. అన్న విషయంపై ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ‘ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు సరిగా వచ్చేది కాదు.. సాధారణంగా నేను సినిమాలు చూడను.. నాకు తెలుగు రాదు కనుక టాలీవుడ్ మూవీస్ అసలు చూసేదాన్ని కాదు.. అప్పట్లో టాలీవుడ్ లో నాకు తెలిసిన హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్. తెలుగులోకి వచ్చాక ఓ సందర్భంలో నన్ను మీకు ప్రభాస్ తెలుసా అని ప్రశ్నించారు.. వాస్తవంగా నాకు ప్రభాస్ తెలియదు అన్నాను. వెంటనే నేను ఏదో పెద్ద తప్పు చేసినట్లు వార్త క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఆ విషయాన్ని పెద్దది చేశారు. అన్నీ తెలిసి కూడా నా గురించి అలా రాయడంతో చాలా బాధపడ్డాను.. ఆ న్యూస్ తో ఇండస్ట్రీలో నాకు పెద్ద తగిలింది.
అప్పట్లో ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బాగా ట్రోల్ చేశారు. ఆ విషయం తల్చుకొని ఇప్పటికీ బాధపడుతుంటాను’అని ఆవేదన వ్యక్తం చేసింది నిత్యామీనన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



