'గాలోడు'గా చేసినందుకు సుధీర్ ఎంత తీసుకున్నాడు?
on Nov 19, 2022

'జబర్దస్త్' షోతో బుల్లితెరపై కమెడియన్‌గా సుడిగాలి సుధీర్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ ఇమేజ్‌తో యాంకర్‌గా మారి సక్సెస్ అయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్, మేనరిజమ్స్, ఫేస్ ఇక్స్‌ప్రెషన్స్‌తో తనదైన ముద్ర వేశాడు. అది అతనికి ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసింది. ఆ ఇమేజ్‌తో 'సాఫ్ట్‌వేర్ సుధీర్'గా తొలిసారి వెండితెరపై హీరోగా నటించాడు. ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా, దానికి వచ్చిన ఓపెనింగ్స్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత '3 మంకీస్', 'వాంటెడ్ పండుగాడ్' మూవీస్ చేసిన సుధీర్, జబర్దస్త్ షోకు గుడ్‌బై కూడా చెప్పేశాడు. ఇప్పుడు 'గాలోడు'గా మనముందుకొచ్చాడు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని రాజశేఖర్ రెడ్డి పులిచర్ల డైరెక్ట్ చేశాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఫ్యాన్స్, ఆడియెన్స్ నుంచి మూవీకి మంచి ఆదరణే లభిస్తోందని కలెక్షన్స్ తెలియజేస్తున్నాయి. మొదటిరోజు ఒక కోటి రూపాయలకు పైగా గ్రాస్ రావడం చిన్న విషయమేమీ కాదు. థియేటర్ల దగ్గర సందడి చూస్తుంటే, శనివారం కూడా వసూళ్లు బాగానే ఉంటాయని తెలుస్తోంది. సుధీర్ చేసిన ఫైట్లు, డాన్సులు, అతను చెప్పిన డైలాగ్స్ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
'గాలోడు'గా నటించేందుకు సుధీర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సోషల్ మీడియా ద్వారా పలువురు ఆరా తీస్తున్నారు. ఈ సినిమాని నిర్మించేందుకు నిర్మాతలకు సుమారు రూ. 2.50 కోట్లు ఖర్చయ్యాయని సమాచారం. ఇందులో సుధీర్‌కు అందింది రూ. 40 లక్షలని వినిపిస్తోంది. అది తక్కువేమీ కాదు. 'గాలోడు' కచ్చితంగా నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు అందిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా తర్వాత సుధీర్ రెమ్యూనరేషన్ పెరుగుతుందని చెప్పడానికి సంశయించాల్సిన పనిలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



