జయసుధ ఆమె భర్తతో ఇంగ్లీష్లోనే మాట్లాడేవారా..?
on Mar 15, 2017
ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకోవడంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. వీరిద్దరిది ప్రేమ వివాహం..అయితే నితిన్ కపూర్ స్వస్థలం ముంబై కావడంతో ఆయన మాతృభాష మరాఠీ, జయసుధ తెలుగమ్మాయి మరీ మీరిద్దరూ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు అని ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు జయసుధ ఇలా సమాధానం ఇచ్చారు. ఇంట్లో తన భర్తతో ఇంగ్లీష్లోనే మాట్లాడతానని..తానే కాదు పిల్లలు కూడా ఆయనతో ఇంగ్లీష్లోనే మాట్లాడేవారమని చెప్పారు. అయితే తన భర్త తెలుగు, తమిళ్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరని..అవసరమైనప్పుడు, సందర్భాన్ని బట్టి తగిన భాష మాట్లాడేవారని నితిన్ కపూర్ గురించి చెప్పుకొచ్చారు. అయితే మా కుటుంబంలో అందరూ తెలుగు స్పష్టంగా మాట్లాడినా రాయడం మాత్రం రాదని నవ్వుతూ చెప్పారు జయసుధ.