సెన్సార్ రిపోర్ట్: కాటమరాయుడు
on Mar 15, 2017
డాలీ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన కాటమరాయుడు అన్ని రకాల కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్‌కి వెళ్లింది. ఈ మూవీని వీక్షించిన సెన్సార్ సభ్యులు కాటమరాయుడుకి క్లీన్ "యూ" సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. సినిమా మొత్తం రన్ టైమ్ 144 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. అటు కాటమరాయుడికి క్లీన్ "యూ" రావడం పట్ల పలువురు ప్రముఖులు చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ నిర్మాత, పవన్ సన్నిహితుడు బండ్ల గణేష్ అయితే సెన్సార్ రిపోర్ట్ చాలా గొప్పగా వచ్చిందని, సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు రిలీజైన పాటలు, టీజర్ అన్నింటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడానికి తోడు తాజాగా క్లిన్ యూ సర్టిఫికేట్ కూడా కాటమరాయుడిపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ మూవీని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ నెల 18న ఫ్రి-రిలీజ్ ఫంక్షన్‌ను, 24న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.