ENGLISH | TELUGU  

8 వసంతాలు ఓటిటిపై నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం.. మీకు మనసు అనేది ఉంటే కష్టమే 

on Jul 7, 2025

మ్యాడ్ మూవీ ఫేమ్ 'అనంతిక సనిల్ కుమార్'(Anathika Sanilkumar)హనురెడ్డి(Hanu Reddy),రవి దుగ్గిరాల(Ravi Duggirala)ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం' 8 వసంతాలు'(8 Vasantalu). ప్రేమ విషయంలో ఒక అమ్మాయి జీవితానికి సంబంధించి 8 సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయనే పాయింట్ తో' 8 వసంతాలు' తెరకెక్కింది. గత నెల జూన్ 20 న థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)భారీ వ్యయంతో నిర్మించగా, పర్వాలేదనే టాక్ ని సంపాదించింది.  

8 వసంతాలు మూవీ ఓటిటి విడుదలకి సిద్దమయ్యింది. ప్రముఖ ఓటిటి మాధ్యమం 'నెట్ ఫ్లిక్స్'(Net Flix)వేదికగా ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టుగా సదరు సంస్థ వెల్లడి చేసింది. తను ప్రేమించింది..ఓడిపోయింది..ఎదిగింది అనే క్యాప్షన్ ని  ఉంచడంతో, ఓటిటి సినీ ప్రేమికులు పదకొండవ తేదీ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మను మూవీ ఫేమ్ 'ఫణింద్ర నరిశెట్టి'(Phanindra Narsetti)దర్శకత్వంలో తెరకెక్కిన' 8 వసంతాలు'లో'శుద్ధి అయోధ్య క్యారక్టర్ కి సంబంధించిన పలు షేడ్స్ లో అనంతిక ఎంతో అత్యద్భుతంగా నటించింది. అసలు ఆ క్యారక్టర్ ఆమె కోసమే పుట్టిందా అనేలా జీవించిందని చెప్పవచ్చు. వరుణ్ గా హనురెడ్డి, సంజయ్ గా రవి దుగ్గిరాల కూడా తమ క్యారక్టర్ ల పరిధి మేరకు నటించారు. ఈ ఇద్దరిలో ఎవరిని 'శుద్ధి' తన జీవిత భాగస్వామి చేసుకుంది. ఈ సందర్భంగా తను ఎంత మానసిక సంఘర్షణకి గురయ్యిందనేది '8 వసంతాలు'లో పర్ఫెక్ట్ గా చూపించడం జరిగింది. 

కన్నా పసునూరి, సంజన హ్రదగేరి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా మ్యూజిక్, టెక్నీకల్ పరంగా కూడా సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. హేషం అబ్దుల్ వహీద్ మ్యూజిక్ అని అందించగా, విశ్వనాధ్ రెడ్డి ఫొటోగ్రఫీని అందించాడు. మనసుని తాకే చిత్రమని మూవీ చూసిన చాలా మంది ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వెల్లడి చేసారు. 

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.