అడ్డంగా బుకైన రష్మిక... తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు!
on Dec 28, 2022

గీతా గోవిందంతో ఓ ఊపు ఊపిన కన్నడ సోయగం రష్మిక మందన పుష్పా చిత్రంతో పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీ సొంతం చేసుకుంది. నేషనల్ క్రష్ గా కుర్ర హృదయాలలో చెరగని ముద్ర వేసుకుని తనదైన శైలిలో ముందుకు సాగిపోతోంది. అయితే రష్మికకు మాత్రం ఆమె మాతృభాష అయిన కన్నడిగుల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తోంది. కన్నడ సినీ ప్రియులు ఈమెని ప్రతి చిన్న విషయానికి టార్గెట్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. కన్నడ డైరెక్టర్ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్‌ను రద్దు చేసుకున్న క్షణం నుంచి రష్మికకు ఈ బెడద మొదలైంది. గీత గోవిందం చిత్రం పెద్ద విజయం సాధించడంతో ఆమె సినిమాలపై దృష్టి కేంద్రీకరించిందని, తనకు ఎంతో సహాయం చేసిన రక్షిత్‌శెట్టికి ద్రోహం చేసిందని విమర్శలు వెల్లువెత్తాయి. విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తోందని కూడా కన్నడ నాట రూమర్స్ వచ్చాయి. ఇలా పలు రకాలుగా రష్మికను కన్నడ నెటిజన్లు ట్రోల్ చేశారు. అయినా కూడా రష్మిక సినిమాకు సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ పాన్ ఇండియా వైడ్ గా తన క్రేజ్ ను చాటుకుంటుంది. ఇదే ఏడాది బాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక బ్యాక్ టు బ్యాక్ అక్కడ మూడు క్రేజీ ప్రాజెక్టులో నటించింది.
అయితే దురదృష్టం ఏమిటంటే ఈ చిత్రాలని థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలలోనే విడుదలవుతున్నాయి. ఇక కాంతారా చిత్రం విషయంలో కూడా ఈమెను కన్నడ నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు. రిషబ్ శెట్టి నటించిన, రూపొందించిన కాంతారా మూవీపై రష్మిక స్పందించడం లేదని ఆమె ఇంకా సినిమా చూడలేదని నానా హంగామా చేశారు. కానీ ఆమె తాను ఈ మూవీ ని ఆలస్యంగా చూశానని, ఆ తర్వాత మేకర్స్ కి మెసేజ్ కూడా చేశాను అని చెప్పుకుంది. ఇంత నెగటివ్ ఉన్నా కూడా రష్మిక మండన తన పనుల ద్వారా ఇప్పటికీ నెటిజన్ల చేతికి దొరికిపోతూనే ఉంది. ఇటీవల ఆమె అండర్‌యాడ్‌లో నటించి ట్రోలర్స్‌కి అడ్డంగా బుక్కయింది. రష్మిక తాజాగా లిక్కర్ బ్రాండ్ కు సంబంధించిన కమర్షియల్ యాడ్‌లో నటించి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే యాడ్ తో నెటిజన్లకు అడ్డంగా బుక్కు కాబోతోంది. రష్మికను పాపం చిన్నచిన్న విషయాలనే సాకుగా చూపి కన్నడిగులు ట్రోల్ చేస్తున్నారు. అండర్‌వేర్ యాడ్‌లో నటిస్తేనే ట్రోల్ చేసిన వారు ఇక రష్మిక లిక్కర్ యాడ్ లో నటిస్తే ఊరుకుంటారా? ఓ రేంజ్ లో ఆడేసుకునే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఆమె ప్రస్తుతం బన్నీ-సుకుమార్‌లతో పుష్ప2 చిత్రంతోపాటు కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న వారీసు చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తెలుగులో వారసుడిగా విడుదల కానుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇటీవలే పుష్ప2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈమె ఆ చిత్రం షూటింగ్‌లో పాల్గొననుంది!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



