'లక్ష్మీ బాంబ్'కూ, లవ్ జిహాద్కూ సంబంధమేంటి?
on Oct 15, 2020
అక్షయ్‌కుమార్, కియారా అద్వానీ జంటగా నటించిన 'లక్ష్మీ బాంబ్' మూవీని బ్యాన్ చెయ్యాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు తీవ్రతరం అయ్యాయి. ఈ సినిమా లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తోందంటూ పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల దీపావళికి సంబంధించిన ఒక ఆభరణాల కంపెనీ ప్రకటనలో వాటి అమ్మకం పేరిట లవ్ జిహాద్‌ను ప్రచారం చేసినట్లు తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే తరహా ఆరోపణలు 'లక్ష్మీ బాంబ్'పై రావడం గమనార్హం. 'లక్ష్మీ బాంబ్'కూ, లవ్ జిహాద్కూ సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే.
'లక్ష్మీ బాంబ్' మూవీ దీపావళికి విడుదల కానుంది. అయితే ఇది లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పోషిస్తున్న పాత్ర పేరు ఆసిఫ్ కాగా, కియారా అద్వానీ పాత్ర పేరు ప్రియ. ఈ పేర్ల ఆధారంగా మూవీని బహిష్కరించాలని సోషల్ మీడియాలో డిమాండ్ పెరుగుతోంది. ట్విట్టర్లో ఒక వినియోగదారుడు "ఇది సరైనదేనా? ఏం జరుగుతోంది?
సినిమా పేరు - లక్ష్మి బాంబ్
రిలీజ్ అవుతున్న పండుగ - దీపావళి
యాక్టర్ (క్యారెక్టర్) పేరు - ఆసిఫ్
యాక్ట్రెస్ నేమ్ - ప్రియ
ఈ వ్యక్తులు లవ్ జిహాద్‌ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? వారు ఎలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు?
#బాయ్కాట్లక్ష్మీబాంబ్" అని ట్వీట్ చేశాడు.
మరో నెటిజన్, "హీరో క్యారెక్టర్ ఒరిజినల్ నేమ్ రాఘవ్‌ను 'లక్ష్మీ బాంబ్'లో ఆసిఫ్‌గా ఎందుకు మార్చారో తెలుసుకోవాలని కుతూహలపడుతున్నా" అని రాశాడు.
'లక్ష్మీ బాంబ్' ఒరిజినల్ మూవీ కాంచనలో హీరో పేరు రాఘవ. ఆ క్యారెక్టర్‌ను డైరెక్టర్ రాఘవ లారెన్స్ స్వయంగా పోషించాడు.
Also Read