నెట్‌ఫ్లిక్స్ కొత్త నిర్ణయం.. స్టార్ హీరోలు, బడా నిర్మాతలు ఇక అంతే!
on Nov 22, 2025
తెలుగు సినిమాలు, సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా ప్రపంచ మార్కెట్‌ను సైతం టార్గెట్ చేస్తోందని అందరూ చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోలు, బడా నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా ఇండియన్ మార్కెట్‌ని మరింత పెంచుకోవచ్చని వారి ఆలోచన. ఒక విధంగా ఓటీటీ సంస్థలను దృష్టిలో పెట్టుకొని వందల కోట్లు బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు.. ఇప్పుడు పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఒకప్పుడు థియేట్రికల్ బిజినెస్ అద్భుతంగా ఉండేది. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి తమ అభిమాన హీరోల సినిమాలను రిపీటెడ్‌గా చూసేవారు. తద్వారా ఆ సినిమాలు 100 రోజులు, 200 రోజులు ఆడేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసేసి మొదటి వారంలోనే తమ పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. దానికి తోడు ఓటీటీ సంస్థలు కూడా పెద్ద సినిమాల రైట్స్ కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా ఈ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి.
తాజాగా నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయం నిర్మాతలకు పిడుగుపాటులా మారింది. సౌత్ సినిమాలను భారీ ఎమౌంట్ ఇచ్చిన కొనుగోలు చేయడం వల్ల ఉపయోగం లేదని గ్రహించిన నెట్‌ఫ్లిక్స్.. సొంతంగా వెబ్ సిరిస్‌లు, రియాల్టీ షోలు, ఒరిజినల్ కంటెంట్‌తో సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకుంది. ఇది తెలుగు, తమిళ హీరోలకు, నిర్మాతలకు పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అన్ని ఓటీటీల కంటే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్‌కి ఎక్కువ డబ్బు చెల్లిస్తుంది. అలాంటిది ఆ సంస్థే సొంతంగా నిర్మాణం చేపడితే తమ సినిమాలు ఎవరు తీసుకుంటారు అనే ఆలోచనలో పడ్డారు నిర్మాతలు. ఒకవేళ నెట్‌ఫ్లిక్స్ సౌత్ సినిమాలను తీసుకున్నప్పటికీ గతంలో ఇచ్చినంత భారీ మొత్తంలో డబ్బు ఇవ్వదని వారికి అర్థమైంది. దాంతో ఇకపై భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం కష్టమే అన్న ప్రచారం జరుగుతోంది. హీరోలు తమ రెమ్యునరేషన్స్‌ని భారీగా తగ్గించుకుంటే తప్ప సినిమాలు తీసే పరిస్థితి లేదు అనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



