బీస్ట్ మోడ్ లో సమంత.. స్ట్రాంగ్ బ్యాక్ తో మెసేజ్..!
on Nov 22, 2025

ఫిట్‌నెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోయిన్స్ లో సమంత ఒకరు. రెగ్యులర్ గా జిమ్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. మోటివేట్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు బీస్ట్ మోడ్ లో దర్శనమిచ్చి సర్ ప్రైజ్ చేశారు. (Samantha Ruth Prabhu)
తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ లో రెండు ఫోటోలను పంచుకున్నారు. ఆ ఫోటోలలో.. కోచ్ కి ఎదురుగా నిల్చొని, కండలు తిరిగిన భుజాలను చూపిస్తూ బీస్ట్ మోడ్ లో కనిపించారు.
"కొన్ని సంవత్సరాల క్రితం… నాకు బలమైన బ్యాక్ రావడం సాధ్యం కాదని, అది నా జీన్స్‌లో లేదని అనుకున్నాను. కానీ, నేను అనుకున్నది రాంగ్ కావడం సంతోషం ఉంది. ఎంతో కష్టపడి ఇది సాధించాను. అందుకే మీకు చూపించాలి అనుకున్నాను. జీవితంలో మజిల్ బిల్డింగ్ అనేది చాలా ముఖ్యం." అంటూ సమంత రాసుకొచ్చారు.
Also Read: వివాదంలో యాంకర్ శివజ్యోతి.. తిరుపతిలో ఇవేం మాటలు!
కాగా, గతంలో సమంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అలాంటి సమంత, ఇప్పుడు బీస్ట్ మోడ్ లో దర్శనమివ్వడంతో అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఫ్యాన్స్ అయితే ఆమె డెడికేషన్ కి ఫిదా అవుతూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



