అఫీషియల్.. దసరా బరిలో 'NBK 108'
on Mar 31, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'NBK 108'(వర్కింగ్ టైటిల్). షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి విజయాల తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో 'NBK 108'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఈ ఏడాది దసరాకు విడుదలయ్యే అవకాశముందని కొంతకాలంగా న్యూస్ వినిపిస్తోంది. తాజాగా మేకర్స్ ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
దసరాకు 'NBK 108' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ 'విజయదశమికి ఆయుధపూజ' పేరుతో మేకర్స్ ఓ పోస్టర్ ను వదిలారు. అయితే తేదీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే దసరా బరిలో రెండు సినిమాలు ఉన్నాయి. రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు'తో పాటు, రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా అక్టోబర్ 20న విడుదల కానున్నాయి. ఇప్పుడు 'NBK 108' కూడా దసరా రేసులోకి అధికారికంగా వచ్చేసింది. దసరా హాలిడేస్ ని క్యాష్ చేసుకునేలా ఈ మూవీ అక్టోబర్ 20 కంటే కాస్త ముందుగానే విడుదలయ్యే అవకాశముంది. సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని త్వరలోనే రివీల్ చేయనున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
