నయనతార నా ఫ్యూచర్ చిల్డ్రన్‌కు తల్లి!
on May 10, 2020

సౌతిండియన్ టాప్ హీరోయిన్ నయనతార, తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. త్వరలో వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు. తమ అనుబంధాన్ని బహిర్గతం చేసిన వాళ్లు తరచూ సోషల్ మీడియాలో తాము కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. కాగా పెళ్లయిన వెంటనే నయనతార తల్లి కానున్నదా?.. అనే ప్రశ్న తలెత్తింది. కారణం.. మదర్స్ డే సందర్భంగా విఘ్నేష్ షేర్ చేసిన ఓ పోస్ట్. ఆ పోస్ట్‌లో నయనతార ఒక చిన్న పిల్లాడిని ఎత్తుకొని ఉంటే, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు విఘ్నేష్. త్వరలోనే తాము దంపతులం కానున్నట్లు అతను ధ్రువీకరించాడు. తన పిల్లలకు నయనతార తల్లి అవుతుందని కూడా అతడు స్పష్టం చేశాడు.
"నా భవిష్యత్ పిల్లలకు తల్లి అయిన ఆమె చేతుల్లో ఉన్న పిల్లాడి తల్లికి హ్యాపీ మదర్స్ డే" అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టాడు విఘ్నేష్. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నయనతార ఫ్యాన్స్‌తో పాటు ఇతరులు కూడా దానికి కామెంట్ల వర్షం కురిపించారు. నయనతారపై తన ప్రేమను వెల్లడించడానికి ఏ చిన్న సందర్భాన్ని కూడా విఘ్నేష్ వదులుకోవట్లేదన్న మాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



