సిగరెట్ అంటే అసహ్యం! కానీ...
on May 11, 2020

తనకు సిగరెట్స్ అంటే అస్సలు ఇష్టం లేదని, అసహ్యం అని నటి హిమజ తెలిపారు. ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే సిగరెట్స్ కలుస్తానని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల నటి హరితేజ ఒక సినిమాలో ఓ సన్నివేశం కోసం సిగరెట్ కాల్చానని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈతరం ఆర్టిస్టులు సిగరెట్స్ కాల్చేయడానికి, మందు తాగడానికి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. క్యారెక్టర్స్ డిమాండ్ చేస్తే తాము సిద్ధమని స్పష్టంగా చెబుతున్నారు. కొన్నిసార్లు ఆల్కహాల్ ట్రై చేశానని హిమజ చెప్పారు.
'నేను శైలజ', 'శతమానం భవతి', 'ఉన్నది ఒకటే జిందగీ' తదితర చిత్రాల్లో హిమజ నటించారు. ప్రస్తుతం తాను ఒంటరి అని ప్రకటించిన ఆమె... తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ లో ఎటువంటి లక్షణాలు ఉండాలో కూడా వివరించారు. అబ్బాయి రొమాంటిక్, ఫన్నీ, క్యూట్ గా ఉండాలని ఆమె వెల్లడించారు. ఇంకో రెండు క్వాలిటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే... అబ్బాయి ఎత్తుగా ఉండాలట. అలాగే, గడ్డం కూడా ఉండాలట. పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేక్షకులకు తెలియకుండా ఉండదని, అందరికీ తెలిసేలా పెళ్లి చేసుకుంటానని ఆవిడ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



