చేయీ చేయీ కలిపి తిరుమలలో నయన్-విఘ్నేశ్ సందడి!
on Sep 27, 2021
లేడీ సూపర్‌స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తిరుమలలో సందడి చేశారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో నయనతార, విఘ్నేశ్ దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆనంద నిలయం బయటకు వచ్చిన వారు... ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ముందుకు నడిచారు. అయితే సంప్రదాయ దుస్తుల్లో చూడముచ్చటగా ఉన్న ఆ జంటను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆ జంటతో సెల్ఫీలు తీసుకునేందుకు సైతం భక్తులు ప్రయత్నించారు. కాని వారికి ఆ అవకాశం ఇవ్వలేదు నయనతార, విఘ్నేశ్ జంట.
‘నేను రౌడీని’ చిత్ర షూటింగ్ సమయంలో నయనతార, విఘ్నేశ్‌లకు పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. నాటి నుంచి వారు దేశ విదేశాల్లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం విధితమే. అయితే ఇటీవల విఘ్నేశ్ పుట్టిన రోజు సందర్భంగా అతనితోపాటు అతని స్నేహితులకు నయనతార ప్రత్యేక పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. విఘ్నేశ్‌తో తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని నయనతార ఇప్పటికే వెల్లడించారు. నయనతార, సమంత, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో విఘ్నేశ్ శివన్ కాదు వాకుల రెండు కాదల్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
