Home

»

Latest News

నా వెనుక పవర్ ఉంది.. నా విజయాన్ని ఎవరూ ఆపలేరు: బండ్ల గణేష్

Sep 27, 2021 5:20PM

పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాలో నదియాతో పోసాని కృష్ణమురళి ఒక డైలాగ్ చెప్తారు. "మీ వెనక ఏదో పవర్ ఉంది. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరు". ఇప్పుడు ఇలాంటి డైలాగ్ నే  పవన్ వీరభిమాని అయిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చెబుతున్నారు. నా వెనక ఎవరు ఉన్నారో.. ఎవరికీ తెలియదు అంటున్నారు.

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల హడావుడి మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవికి బండ్ల గణేష్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఎన్నికల గురించి తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తాను రాకెట్ లా దూసుకుపోతానని, తన విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తన వెనుక ఎవరున్నారో, ఎంతమంది ఆశీస్సులు ఉన్నాయో ఎవరికీ తెలియదని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. అసోసియేషన్ కు సొంత భవనం కావాలని అన్నారు. తాను గెలిస్తే కనీసం వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తానని తెలిపారు. ఫండ్స్ కోసం ఎక్కడో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు. మన హీరోలు కోహినూర్ వజ్రాలని.. ఆ వజ్రాలు ప్రకాశిస్తే ఎన్ని భవనాలైనా కట్టొచ్చని అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఏదైనా ప్రోగ్రాం నిర్వహించి.. దాంతో వచ్చిన డబ్బులతోనే ఇళ్లు కట్టొచ్చని బండ్ల చెప్పుకొచ్చారు.

కాగా మా ఎన్నికలు అక్టోబర్ 10 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ నడుమ ప్రధానంగా పోటీ నెలకొంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com