బాయ్ ఫ్రెండ్ తో తరచుగా యు.యస్. అందుకే వెళ్తుంది
on Mar 13, 2018

సౌత్ లో అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ, ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ మంచి ఫామ్ తో దూసుకెళ్తుంది యాక్ట్రెస్ నయనతార. తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ, సెలెక్టివ్ గా చేస్తుంది. చిరంజీవి సరసన సైరా నరసింహ రెడ్డి లో మెయిన్ యాక్ట్రెస్ గా చేయనున్న నయన్, తమిళ్ లో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తుంది. తమిళ్ లో సూపర్ హిట్ అయినా ఆరమ్ తెలుగు వెర్షన్ ఈ శుక్రవారం కర్తవ్యం గా తెలుగు ప్రేక్షకుల ముందుకి వస్తుంది.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న విషయం నయన్ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే ఫ్యూచర్ గురించి ప్లాన్స్ వేసుకుంటుంది. అయితే, ఈ మధ్య తరచుగా తన బాయ్ ఫ్రెండ్ మరియు దర్శకుడు విగ్నేష్ శివన్ తో యు.యస్. లోని కాలిఫోర్నియా కి వెళ్లి వస్తుందట. ఇంతకీ ఆమె అలా ఎందుకు వెళ్తుందనే కదా మీ డౌట్. అక్కడ ఒక రెస్టారెంట్ ప్లాన్ చేస్తుందట. అన్నీ సెట్ అయితే, త్వరలోరెస్టారెంట్ కి సంబంధించి పనులు మొదలు పెడుతుందట. హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తర్వాత పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయి, బిజినెస్ వ్యవహారాలూ దగ్గరుండి చూసుకుంటుందట. అంతేనా, గ్రీన్ కార్డు కోసం కూడా ప్రయత్నాలు మొదలు పెట్టిందట. మంచి ముందు చూపే కదా!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



