ఆ మౌనం వెనుక రహస్యం అదేనా....!
on Mar 12, 2018

అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ ను అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా రోజుల తరువాత బయటకు వచ్చాడు. టి.సుబ్బిరామిరెడ్డి ఆర్గనైజ్ చేసిన ఓ ఈవెంట్ కు త్రివిక్రమ్ కూడా వచ్చాడు. అయితే ఈవెంట్ కు వచ్చిన ఆయన ఏం మాట్లాడకుండా.. సైలెంట్ ఉండటం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి త్రివిక్రమ్ మంచి రైటరే కాదు.. మంచి వక్త కూడా.. ఇలాంటి ఈవెంట్స్ కు వచ్చినప్పుడు చాలా ఇన్ స్పైరింగ్ గా మాట్లాడతాడు. అలాంటి త్రివిక్రమ్... సైలెంట్ ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. దీంతో అసలు ఆయన ఎందుకొచ్చినట్టు.. ఎందుకు మాట్లాడకుండా ఉన్నట్టు అని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అసలు ఈ మీటింగ్ గెస్టుల్లో ఆయన పేరే లేదు.. కాకపోతే... ఈ మీటింగుకు వచ్చిన బ్రహ్మానందం త్రివిక్రమ్ దగ్గరలోనే ఉన్నాడని తెలిసి.. ఆయనను బలవంతం చేసి మరీ ఈ మీటింగుకు తీసుకొచ్చారని సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు.. అజ్ఞాతవాసి ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరచడం.. త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ ఏ కోశానా ఆ స్క్రిప్టులో లేదనే విమర్శలు రావడంతో... యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన తరవాత ప్రాజెక్టు కోసం కష్టపడుతున్నాడట. తనపై వచ్చిన విమర్శలకు ఈ సినిమా స్క్రిప్టుతోనే బదులివ్వాలని గట్టిగా డిసైడయ్యాడట. మీటింగుకు వచ్చినా సైలెంట్ గా ఉండిపోయాడని అంటున్నారు. మొత్తానికి అజ్ఞాతవాసి ఎఫెక్ట్ త్రివిక్రమ్ పై బాగానే పడినట్టు ఉంది. మరి ఎన్టీఆర్ సినిమాలో తన మార్క్ తో.. పంచ్ డైలాగ్స్ తో పాత త్రివిక్రమ్ మళ్లీ ఫామ్ లోకి రావాలని కోరుకుందాం...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



