నన్ను నవాజుద్దీన్ రేప్ చేశాడు.. కేసు పెట్టిన భార్య!
on Sep 24, 2020

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. వైవాహిక బంధంలోని సమస్యలు అతడిని మరోసారి వార్తాల్లోకి తీసుకొచ్చాయి. నవాజుద్దీన్ రేప్ చేశాడని ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో అతడి భార్య ఆలియా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చీటింగ్ కూడా చేశాడని అందులో ఆమె పేర్కొన్నారు. నవాజుద్దీన్ సోదరుడు షామాస్ తనను లైంగికంగా వేధించాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్టు ముంబై ఖబర్.
కొన్ని రోజుల క్రితం భర్త నుండి విడాకులు కోరుతూ ఆలియా కోర్టు మెట్లు ఎక్కారు. లాక్‌డౌన్‌లో పోస్టాఫీసులు పని చేయని కారణంగా వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా విడాకుల నోటీసులు పంపించారు. ఆ సమయంలో భర్త మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తమ విడాకులకు షామాస్ కూడా ఓ కారణం అన్నారు. ఆలియా ఆరోపణలపై నవాజుద్దీన్ ఇప్పటివరకూ స్పందించలేదు. అతడి తమ్ముడు షామాస్ మాత్రం డబ్బు కోసమే ఆలియా ఇదంతా చేస్తోందని అంటున్నారు. రేప్ కేసుపై నవాజుద్దీన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



