'నారప్ప' ఫ్యామిలీ ఉగాది పోస్టర్
on Apr 13, 2021
వెంకటేశ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తోన్న చిత్రం 'నారప్ప'. ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఈరోజు సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో నారప్ప కుటుంబం అంతా కనిపిస్తోంది. నారప్ప భార్య సుందరమ్మ (ప్రియమణి), బావమరిది (రాజీవ్ కనకాల), పెద్దకొడుకు (కార్తీక్ రత్నం), చిన్నకొడుకు, కూతురు ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. సుందరమ్మ భర్తవంక చూస్తూ నవ్వుతుండటాన్ని బట్టి మంచి సంతోషకరమైన సందర్భానికి సంబంధించిన సన్నివేశంగా మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ పోస్టర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన వెంకటేశ్, "ఈ ఉగాది మీకు అపరిమితమైన ఆనందాన్నీ, ప్రశాంతతనూ ఇస్తుందని ఆశిస్తున్నా! మనకు ప్రియమైన వాళ్లతో కలిసి ఈ రోజును సురక్షితంగా సెలబ్రేట్ చేసుకుందాం." అని ట్వీట్ చేశారు.
తమిళంలో ధనుష్ టైటిల్ రోల్ చేయగా వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ ఫిల్మ్, ధనుష్‌కు బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ తీసుకొచ్చిన ఫిల్మ్ 'అసురన్'కు 'నారప్ప' రీమేక్. ఒక భూస్వామి నుంచి తన కొద్దిపాటి భూమిని కాపాడుకొనే యత్నంలో నారప్ప ఎలాంటి సవాళ్లను, సమస్యలను ఎదుర్కొన్నాడు, ఏం కోల్పోయాడు, ఏం సాధించాడు? అనేది ఇందులోని ప్రధానాంశం. ఒరిజినల్లో మంజు వారియర్ చేసిన క్యారెక్టర్‌ను ప్రియమణి, పశుపతి చేసిన పాత్రను రాజీవ్ కనకాల చేస్తున్నారు. ఒరిజినల్లో చేసిన లాయర్ క్యారెక్టర్‌ను నారప్పలోనూ ప్రకాశ్ రాజ్ పోషిస్తున్నారు. ఆడుకాలమ్ నరేన్ చేసిన పాత్రను సంపత్ రాజ్ చేస్తున్నాడు. అయితే ఒరిజినల్లో ధనుష్ మేనకోడలుగా కీలక పాత్రలో కనిపించిన అమ్ము అభిరామి పాత్రను తెలుగులో ఎవరు చేస్తున్నదీ ఇంతదాకా వెల్లడి కాలేదు.
మణిశర్మ సంగీతం, శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీని ఒరిజినల్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్. థానుతో కలిసి డి. సురేశ్‌బాబు నిర్మిస్తున్నారు. పరిస్థితులు సానుకూలంగా ఉంటే మే నెలలో 'నారప్పను' ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనది నిర్మాతల సంకల్పం.
Also Read