' అలా మొదలైంది ' కాంబినేషన్ మళ్లీ రిపీటవుతుందా..?
on Mar 7, 2016
నాని, నందినీ రెడ్డి ఇద్దరికీ స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన సినిమా అలా మొదలైంది. ఈ సినిమాతో నాని ఒక్కసారిగా, చిన్న సినిమాల ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. నందిని జబర్దస్త్ అనే సినిమా తీసి బోర్లా పడింది. దీంతో తన మూడో సినిమా కళ్యాణ వైభోగమే ను మళ్లీ పాత ట్రాక్ లోకి వెళ్లి, ఫ్యామిలీ అండ్ లవ్ కామెడీగా రూపొందించి హిట్ కొట్టింది. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తోంది.
దాంతో నందిని మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. లెటెస్ట్ టాక్ ప్రకారం, తన తర్వాతి సినిమాను, హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నానితో చేయబోతోందట నందిని. ఇప్పటికే చాలా ప్రొడక్షన్ హౌస్ లు నందిని అవకాశం ఇస్తుండటంతో, నందిని వాటిలో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ను సెలక్ట్ చేసుకుందని, త్వరలోనే నానితో సినిమా పట్టాలెక్కించబోతోందని సమాచారం. దీనికి నాని కూడా సై అన్నాడని ఇన్ సైడ్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



